¡Sorpréndeme!

Krunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

2025-04-28 1 Dailymotion

నిన్న హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా విరాట్ కొహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఆరు హాఫ్ సెంచరీలు కొట్టాడు. టెర్రిఫిక్ ఫామ్ అది. కానీ నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ కంటే ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం కృనాల్ పాండ్యా. పేరుకే ఆల్ రౌండర్ అయినా ఎప్పుడూ బౌలింగ్ కే కృనాల్ సేవలను టీమ్స్ వాడుకునేవి. బ్యాటింగ్ వియంలో మాత్రం ఎక్కడో లోయర్ డౌన్ లోబ్యాటింగ్ కి దిగేవాడు. ఫలితంగా పెద్దగా స్కోర్లు చేసే అవకాశం కృనాల్ పాండ్యాకి ఉండేది కాదు. కానీ నిన్న ఢిల్లీతో మ్యాచ్ లో మాత్రం పెద్ద పాండ్యా ఆర్సీబీ పరువు కాపాడేశాడు. తన తమ్మడు హార్దిక్ పాండ్యా లానే తనూ పవర్ ఫుల్ హిట్టర్ నని చాటి చెప్పేలా ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.  47బంతుల్లో 5ఫోర్లు 4సిక్సర్లతో 73పరుగులు చేసిన కృనాల్ పాండ్యాకు ఇది కెరీర్ లో రెండో హాఫ్ సెంచరీ. కృనాల్ పాండ్యా తన మొదటి అర్ధశతకాన్ని ముంబైలోఉన్నప్పుడు కొట్టాడు. కో ఇన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కూడా కొట్టింది ఢిల్లీ మీదే. సో అలా తొమ్మిది సంవత్సరాల తర్వాత నిన్న కృనాల్ పాండ్యా కొట్టిన ఆ 73పరుగులు ఆర్సీబీకి కొండంత అండగా నిలవటంతో పాటు ఆ టీమ్ సక్సెస్ ఫుల్ గా టార్గెట్ ఛేజ్ చేసి...ఢిల్లీని ఢిల్లీ లో ఓడించి 6వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టేయటంతో పాటు 14పాయింట్స్ తో టేబుల్ లో మొదటి స్థానాన్ని ఆర్సీబీ సగర్వంగా అధిష్టించేలా చేశాడు కృనాల్ పాండ్యా. బౌలింగ్ లోనూ ఓ వికెట్ తీసుకున్న పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.